VIDEO: బాపట్లలో మిడ్ హెల్త్ ప్రొవైడర్స్ నిరసన ర్యాలీ

BPT: మిడ్ హెల్త్ ప్రొవైడర్స్/కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లాలో నిరవధిక సమ్మె కొనసాగుతోంది. సమ్మెలో భాగంగా మంగళవారం బాపట్ల పట్టణంలో మిడ్ హెల్త్ ప్రొవైడర్లు నిరసన ర్యాలీ నిర్వహించారు. పాత బస్టాండ్ వద్ద వారు మానవహారంగా ఏర్పడి తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు.