'తేమ శాతంతో సంబంధం లేకుండా పంటలు కొనుగోలు చేయాలి'
ADB: తేమ శాతంతో సంబంధం లేకుండా పంటలను కొనుగోలు చేయాలని CCI జిల్లా మేనేజర్ పునీత్ కుమార్‌ను మాజీమంత్రి జోగు రామన్న సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. ఎకరాకు 7 క్వింటాళ్ల పత్తి కొనుగోలు నిబంధనను రద్దు చేయాలన్నారు. అకాల వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని డిమాండ్ చేశారు.