VIDEO: పశుపోషకులకు పాలకేంద్రం అండ

ELR: నూజివీడు మండలం రావిచర్లలో అనారోగ్యంతో మృతి చెందిన కస్తూరి రాంబాబు కుటుంబానికి విజయ పాలకేంద్రం తరఫున రూ. 50 వేల చెక్కును శుక్రవారం అందించారు. ఈ సందర్భంగా కృష్ణ మిల్క్ యూనియన్ డైరెక్టర్ పలగాని కొండలరావు మాట్లాడుతూ.. పాలు పోసే ప్రతి రైతుకు క్షీర బంధువు పథకం ద్వారా ఆర్థిక సాయం అందించటం జరుగుతుందన్నారు. ఇలా జిల్లాలో ఎప్పటికీ 3,000 మందికి ఆర్థిక సాయం అందించమన్నారు.