కాంగ్రెస్-డీఎంకే మధ్య కుదిరిన సీట్ల సర్దుబాటు
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్-డీఎంకే మధ్య సీట్ల సర్దుబాటు ఖరారైంది. కాంగ్రెస్ 28 స్థానాలు, డీఎండీకే 10, వీసీకే 8, సీపీఐ 5, సీపీఎం 5 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. మిగిలిన 164 స్థానాల్లో డీఎంకే పోటీ చేయనుంది. కాగా, అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 23న జరగనుంది. అలాగే మే 4న ఫలితాలు వెలువడనున్నాయి.