పరీక్ష పత్రాల మూల్యాంకన కేంద్రాన్ని పరిశీలించిన MLC
ఏలూరు కోటదిబ్బ జూనియర్ కాలేజీ నందు జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్ష పత్రాల మూల్యాంకన కేంద్రాన్ని ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తి శుక్రవారం పరిశీలించారు. మూల్యాంకన విధులకు హాజరైన ఉపాధ్యాయుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారికి కల్పిస్తున్న సౌకర్యాలు ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయ సంఘాల నేతలు పాల్గొన్నారు.