పురుగుమందు తాగి వ్యక్తి ఆత్మహత్య
WGL: పురుగుమందు తాగి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన నగరంలో చోటుచేసుకుంది. మట్టేవాడ సీఐ కరుణాకర్ రావు కథనం మేరకు.. మర్రి వెంకటయ్య కాలనీకి చెందిన ఇమ్మడి ప్రవీణ్ (45) అనే వ్యక్తి ఇంట్లోనే పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు గమనించి, వెంటనే ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నిన్న సాయంత్రం మృతిచెందాడు. ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేపింది.