తెనాలిలో వినాయక చవితిపై పోలీసుల సూచనలు

GNTR: తెనాలిలో వినాయక చవితి మండపాలు ఏర్పాటు చేసేవారు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని గురువారం డీఎస్పీ జనార్ధనరావు సూచించారు. సరైన అనుమతులు లేకుండా మండపాలు ఏర్పాటు చేయవద్దని ఆయన హెచ్చరించారు. విద్యుత్, అగ్నిమాపక శాఖల నుంచి కూడా నిబంధనల ప్రకారం అనుమతులు తీసుకోవాలని తెలిపారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు.