VIDEO: టోల్ ప్లాజా వద్ద కారులో అగ్నిప్రమాదం, కారు పూర్తిగా దగ్ధం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని మేడిపల్లి టోల్ ప్లాజా వద్ద శుక్రవారం ఓ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి కారు పూర్తిగా దగ్ధమైంది. కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు అప్రమత్తంగా బయటకు రావడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. కాటారం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరణలను సేకరిస్తున్నారు.