సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసిన MLA

సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసిన MLA

అన్నమయ్య: గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే షాజహాన్ భాషా స్పష్టం చేశారు. సోమవారం మదనపల్లె మండలం రామిరెడ్డి గారి పల్లెలో రూ. 5 లక్షల అంచనా వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. అనంతరం టి. సంతోష్ కుమార్ రెడ్డి అనే వ్యక్తికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద మంజూరైన లక్ష 30 వేల చెక్కును అందజేశారు.