వంట గ్యాస్ ధరలు తక్షణమే తగ్గించాలి

VZM: వంట గ్యాస్ ధరలు తక్షణమే తగ్గించాలని సిపిఐ మండల కార్యదర్శి మొయిద పాపారావు కోరారు. నెల్లిమర్లలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గ్యాస్ బండపై ఏకంగా రూ.50 పెంచడం దారుణమన్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఎన్నికల ముందు ధరలు తగ్గిస్తానని చెప్పి అధికారం చేపట్టి అమాంతంగా పెంచడం దారుణమన్నారు. పెంచిన గ్యాస్ ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.