భారీగా అక్రమ ఇసుక నిల్వలు

NZB: పొతంగల్ మండల కేంద్రంలో భారీగా ఇసుక నిల్వలను గురువారం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మంజీరా నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తూ గ్రామ సరిహద్దులో నిల్వచేస్తున్నట్లు స్థానికులు తెలిపారు. తహసీల్దార్ గంగాధర్ ఇసుక నిల్వను గుర్తించి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.