గంజాయి తరలింపుపై నిఘా ఉంచాలి: ఎస్పీ

గంజాయి తరలింపుపై నిఘా ఉంచాలి: ఎస్పీ

PPM: గంజాయి, నాటు సారా అక్రమ రవాణాపై నిఘా ఉంచాలని మన్యం జిల్లా ఎస్పీ ఏస్.వి మాధవ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం పాచిపెంట మండలం మాతుమూరు గ్రామం వద్ద గల గ్రీన్ ఫీల్డ్ రహదారిని పరిశీలించారు. ఒడిశా నుంచి ఈ రహదారిపై ఆలూరు, మతుమూరు మీదగా గంజాయి, నాటుసారా అక్రమంగా రవాణా చేసే అవకాశం ఉందన్నారు. ఈ రహదారి గుండా ప్రయాణించే ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలన్నారు.