సీసీ కెమెరాలు అందజేసిన పూర్వ విద్యార్థి
ప్రకాశం: తర్లుపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థి, సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ ఏరువ మనోహర్ రెడ్డి రూ. 43,000 విలువైన సీసీ కెమెరాలను ఇవాళ హెచ్‌ఎం సుధాకర్ బాబుకు అందజేశారు. తాను చదువుకున్న పాఠశాలపై మమకారంతో పాటు పాఠశాల ఆస్తుల భద్రత, విద్యార్థుల కదలికల పర్యవేక్షణ లక్ష్యంగా ఈ విరాళం అందించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మనోహర్ రెడ్డిని హెచ్‌ఎం అభినందించారు.