MLC జయమంగళ రాజీనామా తిరస్కరణ
AP: ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామాను శాసనమండలి ఛైర్మన్ మోషేన్ రాజు తిరస్కరించారు. 2024 నవంబర్‌లో వైసీపీకి, పదవికి ఆయన రాజీనామా చేయగా, ఆమోదంపై కాలయాపన జరుగుతోందని ఆయన గతంలో హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో విచారణ చేపట్టిన ఛైర్మన్, జయమంగళ ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదని పేర్కొంటూ రాజీనామాను తోసిపుచ్చారు.