జిల్లాలో రేపటి నుంచి పోలీస్ చట్టం అమలు

జిల్లాలో రేపటి నుంచి పోలీస్ చట్టం అమలు

మెదక్: జిల్లాలో రేపటి నుంచి ఆగస్టు 31 వరకు పోలీస్ చట్టం అమల్లో ఉంటుందని ఎస్పీ శ్రీనివాస రావు తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, ర్యాలీలు, సభలు, సమావేశాలు, ఆందోళన కార్యక్రమాలను నిర్వహించరాదని ఆయన స్పష్టం చేశారు. అనుమతి లేకుండా ఎవరైనా ఇటువంటి కార్యక్రమాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.