VIDEO: తప్పిన ప్రమాదం.. కారులో మంటలు

VIDEO: తప్పిన ప్రమాదం.. కారులో మంటలు

కోనసీమ: జిల్లా రామచంద్రపురంలో మెయిన్ రోడ్డులో శనివారం సాయంత్రం ఓ కారు అగ్నికి ఆహుతైంది. ఇంజన్ అధికంగా హీటెక్కడంతో ఒక్కసారిగా ఈ ప్రమాదం సంభవించినట్లు స్థానికులు చెప్తున్నారు. వెంటనే స్పందించిన అగ్ని మాపక సిబ్బంది మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.