హుజూర్‌నగర్‌లో పోలింగ్ కేంద్రాల పరిశీలన
SRPT: హుజూర్‌నగర్ మండలంలోని 11 గ్రామపంచాయతీల పరిధిలో ఉన్న పోలింగ్ కేంద్రాలను అధికారులు మంగళవారం పరిశీలించారు. ఎస్సై బండి మోహన్, ఎంపీవో లావణ్య ఇతర అధికారులతో కలిసి మొత్తం 110 పోలింగ్ కేంద్రాల్లో 27 కేంద్రాలను పర్యవేక్షించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లు, సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించినట్టు అధికారులు తెలిపారు.