పని చేయని మిషన్.. రోడ్డుపై బస్సు

పని చేయని మిషన్.. రోడ్డుపై బస్సు

NLR: ఆత్మకూరు ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు టిక్కెట్లు కొట్టే మిషన్ పనిచేయక రోడ్డుపైనే ఆగిపోయింది. కావలికి వెళ్తున్న ఈ బస్సులో ఎక్కిన ప్యాసింజర్లకు టికెట్లు కొట్టే సమయంలో మిషన్ పనిచేయలేదు. దీంతో టిక్కెట్లు కొట్టే వీలు లేక వింజమూరు సమీపంలో బస్సును అక్కడే నిలిపివేశారు. బస్సు కండక్టర్ డిపో అధికారులను సంప్రదించగా.. మాన్యువల్ టికెట్‌తో బస్సు బయలుదేరింది.