రైతులకు అండగా కూటమి ప్రభుత్వం: ఎమ్మెల్యే

రైతులకు అండగా కూటమి ప్రభుత్వం: ఎమ్మెల్యే

ATP: శెట్టూరు మండలం బసంపల్లిలోని మామిడి తోటలో నిర్వహించిన అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ మూడో విడత నిధుల విడుదల కార్యక్రమంలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు పాల్గొన్నారు. నియోజకవర్గంలోని 50,595 మంది రైతులకు రూ.30.27 కోట్లు జమ కావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని కొనియాడారు.