VIDEO: శ్రీపళ్లికొండేశ్వర ఆలయ అభివృద్ధికి రూ.15 లక్షల విరాళం
TPT: నాగలాపురం మండలం సురుటుపల్లి శ్రీపళ్లికొండేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి భారీ విరాళం అందింది. టీడీపీ సత్యవేడు ప్రోగ్రాం కోఆర్డినేటర్ కూరపాటి శంకర్ రెడ్డి రూ.15 లక్షలు విరాళంగా అందజేశారు. ఆలయ ఛైర్మన్ పద్మనాభ రాజు చేతుల మీదుగా ఈవో లతకు నగదు అందజేశారు. ఆలయం వెనుక భాగాన ఉన్న ఓ ఇంటిని ఖాళీ చేసేందుకు బాధిత కుటుంబానికి ఈ నగదు అందజేయాలని కోరారు.