నేడు రావులపాలెం రైతు బజార్‌కు సెలవు
కోనసీమ: రావులపాలెం రైతు బజార్‌కు మంగళవారం వారంతరపు సెలవుగా నిర్ణయించినట్లు మార్కెటింగ్ శాఖ ఏడీ విశాలాక్షి తెలిపారు. రైతులు, వ్యాపారుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రతి మంగళవారం రైతు బజార్ మూసి ఉంటుందని, వినియోగదారులు ఈ మార్పును గమనించి సహకరించాలని ఎస్టేట్ ఆఫీసర్ తేజ కోరారు. మిగిలిన అన్ని రోజుల్లో యథావిధిగా పనిచేస్తుందన్నారు.