ఒక్క రోజే 17 లక్షల లీటర్ల పెట్రోల్ సరఫరా
HYD: నగరంలో ఇంధనం సరఫరా సాధారణ స్థితికి చేరుకుంది. యుద్ధం కారణంగా ఇంధనం దొరకదని గత మూడ్రోజులుగా సిటీలోని బంకుల వద్ద వాహనాలు బారులు తీరిన సంగతి తెలిసిందే. అయితే, నిన్న ఒక్క రోజే 17 లక్షల Ltrs పెట్రోల్, 13 లక్షల Ltrs డీజిల్ సరఫరా చేసినట్లు HPCL సంస్థ తెలిపింది. మిగతా సంస్థలు కూడా కోరినంత ఇంధనం సరఫరా చేస్తామన్నాయి. ఈ మేరకు ఆయా సంస్థలు సైట్లలో ఏరియాలోని పెట్రోల్ స్టాక్ వివరాలు పొందుపరిచాయి.