గంజిహళ్లిలో ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య
గోనెగండ్ల మండలం గంజిహళ్లి గ్రామానికి చెందిన బోయ రమేష్ (33) మానసిక సమస్యలతో బాధపడుతూ గురువారం ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. తిరుపతికి వెళ్తానని తల్లికి చెప్పి, రాత్రి ఇంటి పైకప్పు కడ్డీలకు ఉరివేసుకుని మరణించాడు. ఇవాళ మృతుని తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.