రాష్ట్రస్థాయి అథ్లెటిక్ పోటీలకు మండపాక విద్యార్థులు
W.G: ఈనెల 22, 23 తేదీల్లో పెదవేగి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో జరిగే రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో తణుకు మండలం మండపాక జడ్పీ పాఠశాల విద్యార్థులు పాల్గొనున్నట్లు ప్రధానోపాధ్యాయరాలు కె.ఫణిశ్రీ తెలిపారు. ఈ పోటీల్లో వి.సుష్మ, ఎం.సత్యశ్రీ, బి.దుర్గాప్రసాద్, వి.నాగదుర్గ, ఎం.అనిల్, ఎస్.కృష్ణలు ఎంపికయ్యారని చెప్పారు.