వినాయకుని నిమజ్జనానికి ఏర్పాట్లు : CI

KDP: వినాయక చవితి పండుగ సందర్భంగా గ్రామాల్లో వినాయకుని విగ్రహాలు పెట్టేందుకు పోలీసు వారి అనుమతులు తీసుకోవాలని CI బాబు సూచించారు. సిద్ధవటంలోని స్థానిక పోలీస్ స్టేషన్‌లో శనివారం ఆయన మాట్లాడారు. సిద్ధవటం పెన్నానది హైలెవెల్ వంతెనపై వినాయకుని నిమజ్జనానికి రెండు భారీ క్రేన్లు ఏర్పాటు చేశామన్నారు. రాత్రి వేళల్లో నిమజ్జనానికి విద్యుత్ సౌకర్యం కూడా కల్పించామన్నారు.