మన ఊరికి మన ఎమ్మెల్యే కార్యక్రమం ప్రారంభం
CTR: వీకోట మండలంలోని గోనుమాకుల పల్లెలో మన ఊరికి.. మన ఎమ్మెల్యే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల వివరాలు తెలిపే కరపత్రాలను ఆయన పంపిణీ చేశారు. ఆలయాల్లో పూజలు నిర్వహించారు. మండలంలో నాలుగు రోజుల పాటు కార్యక్రమం జరగనుంది.