పారిశుధ్య నిర్వహణ పనులను పరిశీలించిన కమిషనర్
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ పారిశుధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణ భాగంగా ఇవాళ స్థానిక 39వ డివిజన్‌లలో పర్యటించారు. సురక్షిత తాగునీటి సరఫరా నిర్వహణ తీరును కమిషనర్ పర్యవేక్షించారు. తాగునీటి సరఫరాపై స్థానిక ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.