స్మార్ట్ స్ట్రీట్ బజార్ ప్రాజెక్ట్ ప్రాంగణాన్ని పరిశీలించిన కమిషనర్
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ స్థానిక జాకీర్ హుస్సేన్ నగర్ ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన స్మార్ట్ స్ట్రీట్ బజార్ ప్రాజెక్ట్ ప్రాంగణాన్ని ఇవాళ టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ విభాగాల అధికారులతో కలిసి పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. స్మార్ట్ స్ట్రీట్ బజార్ దుకాణాలను అనుసంధానించేలా పాదచారుల మార్గం రూపొందించేందుకు ప్రణాళికలను సంసిద్ధం చేయాలని సూచించారు.