నేడు ఉచిత వైద్య శిబిరం
అన్నమయ్య: పీలేరు మండలంలోని మేళ్లచెరువులో ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. తిరుపతి రమాదేవి మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఈ శిబిరం జరగనుందని చెప్పారు. అన్ని వ్యాధులకు సంబంధించి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారన్నారు. అవసరమైన వారికి శస్త్ర చికిత్స ఉచితంగా చేస్తామని వెల్లడించారు. గ్రామస్థులు ఈ అవకాశన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.