రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

KRNL: గోనెగండ్లలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌పై వెళ్తున్న యువకులను వెనకనుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బోయ మునిస్వామి(30) అక్కడికక్కడే మృతి. మరో యువకుడు వీరేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనతో వారి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.