ఎల్లంబజార్ 45 అడుగుల విగ్రహం వద్ద సీఐ పూజలు

WGL: ఎల్లమ్మబజార్లో ఏర్పాటు చేసిన 45 అడుగుల భారీ గణపతి విగ్రహం వద్ద భక్తుల సందడి నెలకొంది. గురువారం సాయంత్రం అక్కడి ఏర్పాట్లను మట్టెవాడ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కరుణాకర్ పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా బందోబస్తు ఏర్పాటు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ సందర్భంగా గణపతిని సీఐ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.