VIDEO: ఉగాది ప్రత్యేక పూజల్లో వన దుర్గమ్మ దివ్య దర్శనం
MDK: పాపన్నపేట మండలం నాగసాన్ పల్లి శివారులోని ఏడుపాయల ఆలయంలో గురువారం ఉగాది పర్వదినం పురస్కరించుకొని వన దుర్గమ్మకు ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు. సుగంధ పుష్పాలు పలు ద్రవ్యాలు, పట్టు వస్త్రాలు సమర్పించి మంగళ హారతులు ఇచ్చారు. తెల్లవారుజాము నుంచి అమ్మవారిని భక్తులు దర్శించుకుంటున్నారు.