VIDEO: గ్రామ పంచాయతి ఎన్నికలను పరిశీలించిన ఎస్పీ
మహబూబాబాద్ జిల్లాలోని పలు మండల కేంద్రాల్లో జరుగుతున్న తొలి విడత గ్రామ పంచాయతి ఎన్నికల సరళిని గురువారం జిల్లా ఎస్పీ డా. శబరీష్ పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల్లో భద్రతా ఏర్పాటు, ఓటర్ల రద్దీ, శాంతిభద్రత పరిస్థితులను సమీక్షించిన ఎస్పీ, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.