'రైతాంగ హక్కుల కోసం పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ'

JN: రైతాంగ హక్కుల కోసం పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ అని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. వారి వర్ధంతి సందర్భంగా పాలకుర్తి మండల కేంద్రంలో ఐలమ్మ చిత్రపటానికి పూలమాలవేసి ఎమ్మెల్యే నివాళులు అర్పించారు. రైతు హక్కుల కోసం ఐలమ్మ పోరాటం నేటికీ స్ఫూర్తిదాయకమని, సమానత్వం కోసం ఆమె చేసిన త్యాగం తరతరాలకు ఆదర్శమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.