గుర్తుతెలియని వృద్ధుడు మృతి

గుర్తుతెలియని వృద్ధుడు మృతి

KDP: ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గుర్తుతెలియని వృద్ధుడు ఆదివారం మృతి చెందినట్లు ఎర్రగుంట్ల పోలీసులు తెలిపారు. గత నెల 13న ముద్దనూరులోని సిమెంట్ ఫ్యాక్టరీ సమీపంలో వున్న ఆంజనేయస్వామి ఆలయం వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో తీవ్రగాయాలయ్యాడు. చికిత్స కోసం ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.