VIDEO: 'విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలి'
E.G: జిల్లాలో చట్టాలపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని అనపర్తి జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి వంశీకృష్ణ అన్నారు. అనపర్తిలో ఓ స్కూల్‌లో ఇవాళ మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జరిగిన న్యాయ అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలల సంరక్షణ చట్టాలు, ఫోక్సో చట్టాలు, తదితర చట్టాల గురించి విద్యార్థులకు వివరించినట్లు తెలపారు.