స్వగ్రామానికి చేరిన వలసజీవి మృతదేహం

స్వగ్రామానికి చేరిన వలసజీవి మృతదేహం

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం భూషణరావుపేటకు చెందిన సంగెం వినోద్ (30) సౌదీ అరేబియా దేశంలో గత నెల 22న ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతదేహం శుక్రవారం ఇంటికి చేరడంతో కుటుంబసభ్యులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. వినోద్ ఉపాధి నిమిత్తం ఏడాది క్రితం సౌదీ అరేబియా దేశానికి వెళ్లాడు. అక్కడ సరైన వేతనం లేదని మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు.