కోనోకార్పస్ మొక్కల తొలగింపుకు చర్యలు

పల్నాడు: వినుకొండ పట్టణంలోని కోనోకార్పస్ మొక్కలు వల్ల ఉష్ణోగ్రతలు పెరిగి పర్యావరణానికి హాని కలిగిస్తున్నాయని మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణి తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు సూచనల మేరకు పురపాలక సంఘ పరిధిలోని డివైడర్ల మధ్యలో ఉన్న వాటిని తొలగించి వాటి స్థానంలో పర్యావరణానికి హాని కలగని మొక్కలు నాటుటకు చర్యలు తీసుకుంటామన్నారు.