ఐదో రోజు శ్రీశైలంలో పోటెత్తిన భక్త జన సందోహం
NDL: శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఐదో రోజు కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయానికి భక్తులు పోటెత్తారు. శివస్వాములకు ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేశారు. ఇరుముడితో వచ్చే భక్తులకు మాత్రమే స్పర్శ దర్శనం కల్పిస్తున్నారు. శివస్వాములు భారీగా తరలొస్తుండటంతో సాధారణ భక్తులు దర్శనానికి ఇబ్బందులు పడుతున్నారు.