గ్రామ అభివృద్ధికి కృషి చేస్తా: సర్పంచ్

గ్రామ అభివృద్ధికి కృషి చేస్తా: సర్పంచ్

VKB: కుల్కచర్ల(M) రాంపూర్‌లో గ్రామసభ నిర్వహించారు. సభలో సర్పంచ్ చెక్కల తిరుపతయ్య మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధికి తన వంతుగా నిర్విరామంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామంలోని పెండింగ్‌లో ఉన్న సమస్యలన్నింటినీ గుర్తించి, వాటి పరిష్కారానికి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతామని పేర్కొన్నారు. సభలో పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మయ్య, కృష్ణయ్య పాల్గొన్నారు.