గ్యాస్ కష్టాలు.. బారులు తీరిన జనం

గ్యాస్ కష్టాలు.. బారులు తీరిన జనం

 HYD:  బోయిన్‌పల్లి మనో వికాస్ నగర్, బోయిగూడ గ్యాస్ ఏజెన్సీల వద్ద తెల్లవారుజాము నుంచే జనం క్యూ కట్టారు. బుక్ చేసినా సిలిండర్లు రాకపోవడం, ఫోన్‌కు మెసేజ్ వచ్చినా డెలివరీ కాకపోవడంతో ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిలిండర్ల కోసం వచ్చిన వాహనాలతో ఏజెన్సీల వద్ద భారీ రద్దీ నెలకొంది. ఈ గ్యాస్ తిప్పలు ఎప్పుడు తీరుతాయో అని సామాన్యులు వాపోతున్నారు.