VIDEO: అక్రమంగా నిర్మించిన బిల్డింగ్ సీజ్

NRML: ఖానాపూర్‌లో 2 సంవత్సరాల క్రితం మున్సిపల్ నుంచి అనుమతులు తీసుకోకుండా అక్రమంగా నిర్మించిన భవనాన్ని ఉన్నతాధికారుల సూచనల మేరకు సీజ్ చేశారు. హైకోర్టు నుంచి ఆ నిర్మాణాన్ని సీజ్ చేయాలని ఉత్తర్వులు అందడంతో సీజ్ చేసి ఆ ఇంటికి గోడప్రతులను అతికించారు. పట్టణ పరిధిలో ఇంకా మరెన్నో అక్రమ నిర్మాణాలు ఉన్నట్టు స్థానికులు చర్చించుకుంటున్నారు.