నిమ్మలకు కేక్ తినిపించిన సీఎం

AP: జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సీఎం చంద్రబాబు కేక్ తినిపించారు. ఈ క్రమంలో రామానాయుడు మాట్లాడుతూ చంద్రబాబు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం నాకు చాలా సంతోషం, సంతృప్తి కలిగించాయన్నారు. ఆయన స్ఫూర్తి, ఆశీస్సులతో నిరంతర సేవలో పనిచేస్తానని పేర్కొన్నారు.