ఎచ్చెర్ల అభివృద్ధిపై చర్చ
SKLM: జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్.ఈశ్వరరావు పాల్గొని నియోజకవర్గ సమస్యలను ప్రస్తావించారు. తాగునీరు, రహదారులు, విద్య, వైద్య రంగాల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులను కోరారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారమే తన తొలి ప్రాధాన్యతని అన్నారు.