రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

కడప జిల్లా మైదుకూరు మండలంలోని వనిపెంటలో బుధవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అక్కురాయపల్లెకు చెందిన వెంకట్రామయ్య రహదారిపై నడుచుకుంటూ వెళుతుండగా తూలి కిందపడ్డాడు. దీంతో అదే సమయంలో వచ్చిన బస్సు ఆయనపైకి దూసుకుపోవడంతో అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.