బీసీ వెల్ఫేర్ హాస్టల్స్‌లో సమస్యలు పరిష్కరించండి

బీసీ వెల్ఫేర్ హాస్టల్స్‌లో సమస్యలు పరిష్కరించండి

SS: బీసీ వెల్ఫేర్ హాస్టల్లో సమస్యలు పరిష్కరించాలని ఏఐఎస్ఏ జిల్లా అధ్యక్షులు శివకుమార్ కోరారు. మంగళవారం పెనుకొండలో ఏబీసీడబ్ల్యూ అధికారి గంగాధర్‌కు వినతి పత్రం అందజేశారు. శివకుమార్ మాట్లాడుతూ.. పెనుకొండ, మడకశిరలో ఉన్న బీసీ హాస్టల్స్‌లో ఆర్‌వో ప్లాంట్లను ఏర్పాటు చేసి తాగునీటి సమస్య పరిష్కరించాలన్నారు. ఖాళీగా ఉన్న వార్డెన్ పోస్టులను భర్తీ చేయాలని కోరారు.