'కస్తూర్బా గాంధీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్స్'

KMM: కారేపల్లిలోని కస్తూర్బా గాంధీ కళాశాలలో 2025 సంవత్సరానికి గాను ఇంటర్ బైపీసీ, ఎంపీసీ గ్రూపులలో స్థానాలు ఖాళీగా ఉన్నాయి. బైపీసీలో 8, ఎంపీసీలో 8 సీట్లు స్పాట్ అడ్మిషన్ ద్వారా ఈ నెల 22వ తేదీన భర్తీ చేయనున్నారు. ఇంగ్లీష్, తెలుగు మీడియంలో విద్య అందుబాటులో ఉంది. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపల్ ఝాన్సీ సౌజన్య తెలుపారు.