గాయపడిన విద్యార్థులను పరామర్శిస్తున్న ఎమ్మెల్యే
ELR: భీమడోలు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పలువురు విద్యార్థులు స్కూల్ నుండి హాస్టల్‌కి వెళ్తున్న సమయంలో పశువుల దాడికి గురై గాయాలపాలయ్యారు. ఈ ఘటనలో గాయపడిన విద్యార్థులు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు గురువారం ఆసుపత్రికి వెళ్లి విద్యార్థులను పరామర్శించారు.