తుంగభద్ర జలాశయం తాజా సమాచారం

ATP: జిల్లా ప్రజలకు HLC ద్వారా తాగు, సాగు నీరు అందించే తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం తగ్గింది. శనివారం ఉదయం 8 గంటల సమయంలో డ్యాంలోకి 13,687 క్యూసెక్కుల నీరు చేరుతోందని అధికారులు తెలిపారు. దీంతో 2,845 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో 80 టీఎంసీల నీరు నిల్వ ఉంది.