భార్యను గన్‌తో బెదిరించిన భర్త
ATP: అనంతపురంలో గన్ కలకలం రేపింది. రాజశేఖర్, మనుషా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో భర్త రాజశేఖర్ భార్య మనుషాను గన్‌తో బెదిరించాడు. మనుషా ఫిర్యాదు మేరకు పోలీసులు గన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు. అయితే రాజశేఖర్‌కు గన్ ఎలా వచ్చిందన్న దానిపై విచారణ చేపట్టారు.